తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే వరుసపెట్టి నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే.. తాజాగా.. టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. గత ఐదు రోజుల క్రితం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేయనుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
