NTV Telugu Site icon

JNTUH : జేఎన్టీయూ హస్టల్‌లో ఆహారం తిన్న పిల్లి ఘటన.. వివరణ ఇచ్చిన ప్రిన్సిపాల్‌

Jntuh

Jntuh

“జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ లోనీ మంజీర బాలుర వసతిగృహము లో ఆదివారము రాత్రి పిల్లి వచ్చి ఆహారం తింటున్నది” అన్న సంఘటన పై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ జీవీ నరసింహ రెడ్డి , హాస్టల్ వార్డెన్ డా యన్ దర్గాకుమార్ , హాస్టల్ కేర్ టేకర్ పలువురు అధికారులు విచారణ చెప్పట్టి జరిగిన సంఘటన పట్ల వివరణ ఇచ్చారు. నిజానికి హాస్టల్‌లో ఓ కిటికీ తెరిచిన కారణంగా లోపలికి పిల్లి వచ్చే అవకాశము ఉండవచ్చును కాని అదికూడా హాస్టల్ పూర్తి గా మూసేసిన రాత్రి సమయం లో , విద్యార్థుల భోజనాలు ముగిసిన తరువాత నే వచ్చి ఉండవచ్చు తప్ప , విద్యార్థుల భోజనం సమయం లో కాని, లేదా వంట చేసిన సమయం లో కాని వచ్చింది కాదు అని ప్రిన్సిపాల్ డా జి వి నర్సింహా రెడ్డి అన్నారు.

వడ్డన సమయం లో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారు, విద్యార్థులు ఉంటారు ఆ సమయం లో పిల్లి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అన్నారు. వారికి ఏ సమస్య ఉన్న వచ్చిన వెంటనే స్పందించి వారికి అధికారులు అండ గా ఉంటున్నా రు అన్నారు ప్రిన్సిపాల్. “జేఎన్టీయూ హాస్టల్ లో ఆహార పదార్దాలలో పిల్లి మూతి పెట్టింది అన్న అంశం” పరిశీలన కోసం కూకటపల్లి నుండి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు మంజీర హాస్టల్ ను పూర్తి స్థాయి పరిశీలన చేశారు. ఓ కిటికీ తెరవడము కారణంగా పిల్లి లోపలకి రావడం జరిగింది తప్ప ఎలాంటి వండిన వడ్డించెందు సిద్ధం గా ఉన్న ఆహారం ముట్టుకోలేదు అన్నారు.

ప్రాథమిక సమాచారం ఆధారంగా, హాస్టల్ విద్యార్థులు , మెస్ వర్కర్లతో చర్చించిన తర్వాత, ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు, మెస్ కోఆర్డినేటర్లు అయిన విద్యార్థులు లేదా హాస్టల్ సిబ్బంది పైన ఉద్దేశపూర్వకంగ వారి ప్రతిష్టను దిగజార్చే విధముగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాలనే దురాలోచనతో చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మెస్ లో జరిగిన విషయమును మెస్ సిబ్బంది కి, వార్డెన్ కి, కాలేజ్ ప్రిన్సిపాల్ కి యూనివర్సిటీ అధికారులు కు కానీ తెలియజేయకుండ సోషల్ పెట్టడము పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిని తగురీతిలో పరిశీలించి నిజ నిర్ధారణ అయితే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకొంటాము అని ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఇదే విషయమును రెక్టర్ డా కె విజయ కుమార్ రెడ్డి గారు , రిజిస్టార్ డా కె వెంకటేశ్వర రావు గారి కు కూడా ప్రిన్సిపాల్ తెలియజేశారు.