NTV Telugu Site icon

Champai Soren: జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్!

Champai Soren Bjp

Champai Soren Bjp

Champai Soren flew to Delhi: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు ఉన్నాయి. చంపైతో పాటు పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారని సమాచారం. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపై బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: MP Kesineni Sivanath: విజయవాడలో క్రికెట్‌ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్‌

జార్ఖండ్‌ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో హేమంత్ తన సీఎం పదవికి రాజీనామా చేయగా.. జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా చంపై నియామకమై.. ఐదు నెలలు పదవిలో ఉన్నారు. జూన్ 28న బెయిల్‌పై హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రావడంతో.. చంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపై కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మరో మూడు నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.