Site icon NTV Telugu

Jio New Recharge Plans: జియో కొత్త ప్లాన్స్.. ఇక వారికి పండగే!

Reliance Jio

Reliance Jio

Jio Introduces New Recharge Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘ రిలయన్స్‌ జియో’ తమ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ.1028, రూ.1029 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను జియో లాంచ్‌ చేసింది. ఈ రెండు ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాను వాడుకోవచ్చు. అంతేకాదు స్విగ్గీ వన్, అమెజాన్‌ ప్రైమ్‌లైట్ మెంబర్‌ షిప్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ల డీటెయిల్స్ చూద్దాం.

1028 ప్లాన్‌:
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌, 2జీబీ డైలీ డేటాను వినియోగించుకోవచ్చు. 5జీ నెట్‌వర్క్‌ ఉన్నచోట అపరిమిత డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో స్విగ్గీవన్ లైట్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. అంతేకాదు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.

Also Read: IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్‌, రోహిత్ సహా..: ఆకాశ్

1029 ప్లాన్‌:
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌, 2జీబీ రోజువారీ డేటా వస్తుంది. 5జీ నెట్‌వర్క్‌ ఉన్నచోట అపరిమిత డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు లభిస్తాయి. అదనంగా అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. 5జీ నెట్‌వర్క్‌ ఉన్నచోట డేటా ఎక్కువ అవసరం అనుకున్న వారు ఈ ప్యాక్‌లను ఎంపిక చేసుకోవచ్చు.

Exit mobile version