NTV Telugu Site icon

JioHotstar: 90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్‌స్టార్ ప్లాన్..

Jio Hotsata

Jio Hotsata

JioHotstar: జియో వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో, తన వినియోగదారుల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.100 మాత్రమే. దీనితో వినియోగదారులు ఇప్పుడు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను తక్కువ ఖర్చుతో వీక్షించే అవకాశం పొందుతారు. ఇది క్రికెట్, వినోద ప్రేమికులకు గొప్ప ఆఫర్‌ అని చెప్పుకోవచ్చు. గతంలో, జియో రూ.195కే జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు కంపెనీ ఇంకా చౌకైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.100కు జియో కొత్త డేటా ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా 5GB డేటా, 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Read Also: Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!

ఇక రూ.100 జియో ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో 5GB హైస్పీడ్ డేటా, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లనిస్తుంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీల్లో 1080p రిజల్యూషన్ వరకు స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది డేటా మాత్రమే ప్యాక్ కావడంతో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులకు బేస్ ప్లాన్ ఉండాలి. 5GB డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గిపోతుంది.

Read Also: STOP Drinking Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే ఇన్ని సమస్యలా?

ఇక గత నెలలో జియో రూ.195కి హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 15GB డేటా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ మొబైల్ మాత్రమే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. అంటే, టీవీలో స్ట్రీమింగ్ చేయాలనుకునే వారు రూ.100 ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. మీరు కూడా జియో వినియోగదారులా? అయితే, ఈ కొత్త ప్లాన్‌ను ఉపయోగించుకొని జియో హాట్‌స్టార్ ప్రయోజనాలను పొందండి.