Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!

Jio

Jio

JIO: దేశంలోని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో బడ్జెట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.55తో 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన కొత్త JioTV Pro Packను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ లోని JioTV యాప్ ద్వారా 1,000కిపైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను చూడవచ్చు.

ఈ కొత్త JioTV Pro Pack ద్వారా 16కు పైగా భారతీయ భాషల్లో ప్రసారమయ్యే 1,000కిపైగా టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా 150కు పైగా ప్రీమియం ఛానెల్స్ ను కూడా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌లో స్టార్‌ప్లస్ హెచ్‌డి, కలర్స్ హెచ్‌డి, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ హెచ్‌డి, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి ప్రముఖ ప్రీమియం ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు చెందిన వినోద ఛానెల్స్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అయితే జియోస్టార్, సోనీకు చెందిన లైవ్ స్పోర్ట్స్ ఛానెల్స్ మాత్రం ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉండవు.

రూ.55 JioTV Pro Pack పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించిన ప్లాన్ మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్, మొబైల్ డేటా లేదా SMS ప్రయోజనాలు ఉండవు. ఇప్పటికే యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈ ప్లాన్‌ను అదనంగా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు ప్రత్యేకంగా ఎలాంటి యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. రూ.55తో రీచార్జ్ చేసిన వెంటనే వినియోగదారులు JioTV యాప్‌ను ఓపెన్ చేసి, తమ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే చాలు. రీచార్జ్ పూర్తికాగానే అన్ని ప్రీమియం ఛానెల్స్ ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తాయి.

ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు:

ఈ JioTV Pro Packను జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరూ ఉపయోగించుకోవచ్చు. ఒకేసారి ఒక మొబైల్ డివైస్‌లో మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ పనిచేస్తుంది. అలాగే ఈ ప్లాన్‌ను ముందుగానే పలుమార్లు రీచార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒక ప్లాన్ గడువు ముగిసిన తర్వాత తదుపరి రీచార్జ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. తక్కువ ధరలో వందలాది ప్రీమియం టీవీ ఛానెల్స్‌ను మొబైల్‌లోనే వీక్షించాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్యాక్ మంచి ఎంపికగా నిలవనుంది.