T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీకి ఇండియా-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే తాజా అప్డే్ట్ ప్రకారం.. టోర్నీ ముంగిట ఐసీసీకి జియోహాట్‌స్టార్ గట్టి జలక్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ గట్టి జలక్ ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్
జియోహాట్‌స్టార్ ఐసీసీకి ఇచ్చిన గట్టి జలక్ ఏంటి అంటే టీ20 ప్రపంచ కప్ అధికారిక ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటామని ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా జియోహాట్‌స్టార్ ఐసీసీకి మరొక షాక్ కూడా ఇచ్చింది. అదే నాలుగేళ్ల భారత మీడియా హక్కుల ఒప్పందంలో మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను ఇంక కొనసాగించలేమని కూడా అఫిషియల్‌గా ఐసీసీకి చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు ఈ నిర్ణయాన్ని ఉన్న పళంగా తీసుకోవడానికి దానికి వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే కారణమని సమాచారం. ఒక ఇంట్రేస్టింగ్ న్యూ్స్ ఏంటంటే 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే సుమారుగా 2.4 బిలియన్ల డాలర్లతో ఒప్పందం చేసుకోడానికి వేట ప్రారంభించిందని సమాచారం.
వాస్తవానికి ఐసీసీ – జియోహాట్‌స్టార్ మధ్య 2024-27 వరకు 3 బిలియన్లు డాలర్లతో డీల్ కుదిరింది. కానీ ఉన్నట్లుండి ఈ డీల్ నుంచి జియోహాట్‌స్టార్ వైదొలగాలని నిర్ణయించడంతో కొత్త భాగస్వామి కోసం బిడ్‌లు వేయాలని పలు ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ఐసీసీ ఆహ్వానాలు పంపింది. కానీ డీలు విలువ భారీగా ఉండటంతో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ముందుకు రావడం లేదని సమాచారం.
READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు
