NTV Telugu Site icon

Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు

Hemanth Soren

Hemanth Soren

ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది.

READ MORE: Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా

కాగా.. భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ జూన్ 28 విడుదలయ్యారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఐదు నెలలపాటు జైలులో ఉన్న జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ విడుదలై మరోసారి జార్ఖండ్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆయన బెయిల్ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఇప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఈడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.