Cinematic Bank Robbery: సినిమా లెవల్‌లో దోపిడి.. బ్యాంక్‌లో రూ.2 కోట్లు దోచుకున్న వైనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinematic Bank Robbery: వీళ్లు మామూలు దోపిడి చేయలేదు అయ్యా.. నిజంగా సినిమా లెవల్ దోపిడి చేశారు. ఇంతకీ ఈ దొంగల ముఠా ఎక్కడ దోచుకున్నారని అనుకుంటున్నారు.. సోమవారం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూర్‌లోని HDFC బ్యాంకు కన్నం వేశారు. ఈ దొంగలు బ్యాంకులో ఏకంగా రూ. 2 కోట్ల వరకు దోచుకున్నట్లు సమాచారం. తుపాకీలతో బెరించి.. అడ్డుకున్న వాళ్లపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతో ఉడాయించారు.
READ ALSO: Bigg Boss 9 : మూడో వారం నామినేషన్స్ లో ఉన్నది వీరే..
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
అసలు ఏం జరిగిందంటే..
డియోఘర్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూర్‌లోని HDFC బ్యాంకులో సోమవారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఏడుగురు దొంగలు ప్రవేశించారు. వాళ్లు రావడం రావడంతోనే గార్డులు, ఉద్యోగులు, కస్టమర్లను తుపాకీలతో బెదిరించి బందీలుగా చేసుకున్నారు. ఈ దొంగలపై ప్రతిఘటించిన కొంతమందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తర్వాత దొంగలు బ్యాంకు నుంచి సుమారు రూ. 2 కోట్ల (నగదు, నగలు) వరకు దోచుకున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దొంగలు పారిపోయిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు వెళ్లి బందీలుగా ఉన్న అధికారులు, ఖాతాదారులను విడిపించి, దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు.
కేసు సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ..
దొంగతనం కేసు సమాచారం అందుకున్న దేవఘర్ పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీపంలోని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, దొంగలు తప్పించుకోకుండా రహదారులపై చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేవఘర్, జమ్తారా, గిరిదిహ్, ధన్‌బాద్, బొకారో పరిసర ప్రాంతాలలో రహదారులపై చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. దొంగిలించ డబ్బలు, నగల గురించి బ్యాంకు అధికారులతో కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.
READ ALSO: Modi Trump Meeting: ట్రంప్ దూకుడుకు మోడీ కళ్లెం వేస్తారా.. ! మలేషియా వేదికగా ఏం జరగబోతుంది..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..