NTV Telugu Site icon

Jharkhand CM: జార్ఖండ్ సీఎం జాడెక్కడ.. ఆచూకీ కోసం ఈడీ గాలింపు..

Hemanth Soren

Hemanth Soren

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ దాదాపు 18 గంటలుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం వేచి చూస్తుంది. అయితే, నిన్న ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ ఓ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది. అలాగే, మరి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే, సీఎం హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు ఈడీ ఈ చర్యలకు పాల్పడుతుందని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) మండిపడుతుంది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని పార్టీ శ్రేణులు తెలిపారు.

Read Also: Student Suicide: కరీంనగర్ లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

ఇక, భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఈడీకి లేఖ పంపారు.. అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పని తీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం సోరెన్ ఆరోపించారు.

Read Also: Mrunal: మృణాల్ మత్తులో సోషల్ మీడియా!

అయితే, తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీకి లేఖ రాశారు. తాను బడ్జెట్‌ కసరత్తుపై బిజీగా ఉన్నాను.. ఫిబ్రవరి 2 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి.. ఈ నెల 31లోపు విచారణకు రావాలని ఎలా ఒత్తిడి చేస్తారు? దీన్ని బట్టి మీ దుర్భుద్ది ఏంటో అర్థమవుతోంది.. మీ చర్యలు హానికరమైనవి, రాజకీయంగా ప్రేరేపితమైనవి అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.