Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు.
బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ, ఇంకా మరొకరు కాల్చబడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ మృతి చెందాడు. దుకాణంలో జరిగిన ఈ దోపిడీ ఘటనను బయట నిలబడిన వ్యక్తులు వీడియో తీశారు. షోరూమ్ లో 5 మంది దుండగులు దోపిడి చేసి.. పారిపోతుండగా దుండగులు కాల్పులు జరిపారు. నేరస్థులు దుకాణంలో దొంగిలించడానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
దొంగలు దోపిడీ చేసేందుకు స్విఫ్ట్ కారులో వచ్చారు. దుకాణం సమీపంలోకి రాగానే అగంతకులు బయట 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం దుకాణదారునికి పిస్టల్ చూపించి షాపులో ఉంచిన నగలను దోచుకెళ్లాడు. అదే సమయంలో దుకాణదారుడు అరవడంతో దుండగులు అతడిని తీవ్రంగా కొట్టి, కాల్పులు జరిపి కారులో పారిపోయారు. ఘటనా స్థలానికి ఎస్పీ భివాడి జ్యేష్ట మైత్రీ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
चोर बेखौफ हो गए हैं और राजस्थान सरकार और पुलिस मौन हैं ।
ज्वेलरी शोरूम ,भिवाडी में चोर दिनदहाड़े घुसते हैं, लूटपाट करते हैं और हत्या कर देते हैं ,आखिर सरकार कब जागेगी ?
जनता की सुरक्षा को लेकर इतनी लापरवाही क्यों ? pic.twitter.com/t8sguiAJaE— VINOD JAKHAR (@VinodJakharIN) August 23, 2024
