Jetly Movie Glimpses: రితేష్ రాణా దర్శకత్వంలో ప్రముఖ హాస్యనటుడు సత్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జెట్లీ’. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో విమాన ప్రయాణానికి సంబంధించిన నవ్వులు పూయించే ఒక హాస్యభరితమైన సన్నివేశాన్ని చూపించారు. విమానంలో ప్రయాణికులు టర్బులెన్స్ (కుదుపులు) ఎదుర్కొంటున్న సమయంలో, సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించడం ఈ గ్లింప్స్‌లో కనిపిస్తుంది.
READ ALSO: VFX in Indian Cinema: VFX తేడా వస్తే ‘దబిడిదిబిడే’
వెన్నెల కిషోర్ సత్యతో నువ్వు హీరోవా అని అడగటం, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఆ అని ప్రశ్నించడం దానికి సత్య.. తనదైన స్టైల్‌లో జనరల్ కంపార్ట్‌మెంట్ అని బదులు ఇవ్వడం గ్లింప్స్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో సత్యతో పాటు రియా సింఘా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ చూస్తే రితేష్ రాణా తనదైన విలక్షణమైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వినోదాన్ని పంచుతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ‘జెట్లీ’ గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక క్రేజీ అండ్ ఫన్నీ రైడ్ అని అనిపిస్తుంది.
READ ALSO: US-Venezuela War: వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి?
