Site icon NTV Telugu

Jemimah Rodrigues: క్లిష్ట సమయంలో స్మృతి మంధానకు అండగా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్.. స్పెషల్ పోస్ట్ వైరల్

Smriti Mandhana

Smriti Mandhana

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ ల వివాహం అనూహ్యంగా వాయిదా పడి చివరకు రద్దైన విషయం తెలిసిందే. తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్మృతి మంధాన ప్రకటించింది. వీరి షాకింగ్ డెసిషన్ తో అటు అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పలాష్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మంధాన ప్రకటించింది. ఇది మంధానకు సులభమైన సమయం కాదు. ఈ క్లిష్ట సమయాల్లో జెమిమా రోడ్రిగ్స్ అండగా నిలిచింది. స్మృతికి ప్రతి అడుగులోనూ ఆమె అండగా నిలిచింది. పెళ్లి వాయిదా పడిన తర్వాత, జెమీమా మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆడకూడదని నిర్ణయించుకుని స్మృతితోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు పెళ్లి రద్దు కావడంతో, జెమీమా తన స్నేహితురాలి పక్కనే ఉండి, ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ ఆమెకు మద్దతు ఇస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జెమిమా ఒక క్రిప్టిక్ ఫోటో పోస్ట్ చేసింది.

Also Read:Tata Sierra Top Speed Test: టాటా సియెర్రా ఫర్ఫామెన్స్ వేరే లెవల్ గురూ.. టాప్ స్పీడ్ ఎంతంటే..?

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒలివియా డీన్ పాడిన “మ్యాన్ ఐ నీడ్” పాటపాడుతున్న యువ గాయకుల గ్రూప్ వీడియోను షేర్ చేసింది. ఆ పాటలోని భావోద్వేగ లిరిక్స్ అభిమానులకు వెంటనే అర్థమయ్యాయి. ఇది స్మృతి పరిస్థితిని సూచిస్తోందని అందరూ భావిస్తున్నారు. అంతేగాక, జెమిమా ఇన్‌స్టాగ్రామ్‌లో పాలష్ ముచ్ఛల్‌ను అన్‌ఫాలో చేసినట్లు ఫ్యాన్స్ గుర్తించారు.

Also Read:Telangana Rising Global Summit Day1: తొలి రోజే రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు..

నవంబర్ 23న సాంగ్లిలో జరగాల్సిన స్మృతి, పలాష్ వివాహం ఆ రోజు వాయిదా పడింది. క్రికెటర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడిందని స్మృతి మేనేజర్ తెలిపారు. ఒక రోజు తర్వాత, పలాష్ ఒత్తిడి సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతలో, సోషల్ మీడియాలో వివిధ పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటన్నిటి మధ్య, స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పలాష్‌ను అన్‌ఫాలో చేసింది.

Exit mobile version