NTV Telugu Site icon

Jeevan Reddy: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ఆరంభించడం హర్షనీయం

Mlc Jeevanreddy

Mlc Jeevanreddy

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలని భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా ఆరంభించడం హర్షనీయమన్నారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కొరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు జీవన్‌ రెడ్డి. దశబ్దకాలం బీఆర్ఎస్ ప్రభుత్వమీదే ఉండే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భిన్న అభిప్రాయం లేదన్నారు జీవన్‌ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి కానీ విమర్శలు చేయకూడదన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలకు నిధులు మంజూరయ్యాయి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు జీవన్‌ రెడ్డి.

  GV Prakash Mother: జి.వి.ప్రకాష్ విడాకులపై.. ఏఆర్ రెహమాన్ సోదరి కీలక వ్యాఖ్యలు

Show comments