జేఈఈ మెయిన్స్ స్మార్ట్ కాపీయింగ్ పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్నేహితుల కోసం కడప జిల్లాకు చెందిన టాపర్ స్మార్ట్ కాపియింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఐదుగురు విద్యార్థులతో కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, జవాబులను ఫోటో తీసి వాట్సాప్‌లో షేర్ చేశాడు కడప జిల్లా విద్యార్థి. లోదుస్తుల్లో స్మార్ట్ ఫోన్లను దాచుకొని తనిఖీల నుంచి తప్పించుకుని పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లినట్లు తేల్చారు పోలీసులు. జేఈఈ పరీక్ష నిర్మాణంలో ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం వహించినట్లు, దీంతో సంస్థ నిర్లక్ష్యాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. స్మార్ట్ ఫోన్స్ రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Ntr : చిరంజీవి నటించిన సినిమాలలో ఎన్టీఆర్ కు నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
ఇద్దరు విద్యార్థులు మల్లాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మౌలాలి లో పరీక్ష రాసినట్లు, వాట్సాప్ ద్వారా తను రాసిన జవాబులను మరో నలుగురికి మైనర్ విద్యార్థి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 5 మంది వద్ద ఐదు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 188, 420తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ లోని 4(బీ), 8 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. పరీక్షల కేంద్రంలో ఉన్న ఇన్విజిలేటర్లు అబ్జర్వర్లకు నోటీసులు ఇచ్చి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు.
