జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే పూర్తి చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు.. పరీక్ష రాసే విద్యార్థులకు NTA కీలక సూచనలు జారీ చేసింది.
Read Also: Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?
కీలక సూచనలు:
పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జా్మ్ హాల్ లోకి ఎంట్రీ ఉండదు.
ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. (పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు).
అలాగే.. ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసినటువంటి పాస్ పోర్టుసైజు ఫొటోను తీసుకెళ్లాలి.. అటెండెన్స్ షీట్‌పై అతికిస్తారు.
విద్యార్థులు బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి.
దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.
జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, డాక్యుపెన్ వంటివి తీసుకెళ్లకూడదు.
అంతేకాకుండా.. ఎక్కువ పాకెట్స్ ఉన్న బట్టలు ధరించరాదు. నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.