Bihar Politics: గత ఏడాది మహారాష్ట్ర వంటి రాజకీయ పరిణామాలకు బీహార్ త్వరలో సాక్ష్యమిస్తుందని బీజేపీ ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు. అధికార జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ బీజేపీతో టచ్‌లో ఉన్నారని అరారియా బీజేపీ ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ తెలిపారు. మహారాష్ట్ర వంటి రాజకీయ పరిణామాలు బీహార్‌లో ఎప్పుడైనా బయటపడతాయన్నారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మినహా జేడీయూ నాయకులందరూ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అరారియా ఎంపీ పేర్కొన్నారు.
Abdul Rehman Makki: అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్ట్.. ఐక్యరాజ్యసమితి ప్రకటన
నితీష్ కుమార్ మినహా అందరికీ బీజేపీ తలుపులు తెరిచి ఉన్నాయి. అతి త్వరలో బీహార్‌లో మహారాష్ట్ర లాంటి పరిస్థితి ఆవిష్కృతం కాబోతుంది. బీజేపీ నేతలు జంప్ అయ్యి బీజేపీతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిపై మహారాష్ట్ర ప్రజలు విశ్వాసం కోల్పోయినట్లుగా.. బీహార్ ప్రజలు జేడీయూ-ఆర్‌జేడీ పాలక కూటమిపై విశ్వాసం కోల్పోయారని బీజేపీ ఎంపీ అన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు నితీష్ కుమార్‌తో ఉండరని.. వారు నితీష్ కుమార్‌ను విడిచిపెట్టి బీజేపీ, ఇతర పార్టీల్లో చేరతారని ఆయన అన్నారు.
