Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ భవనం (విధాన సౌధ)లో ముస్లింల కోసం ప్రార్థన గదిని కోరుతూ జనతాదళ్ (సెక్యులర్) లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) సభ్యుడు బీఎం ఫరూక్ ఎగువ సభ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే నమాజ్ చేసేందుకు గది కావాలని కోరగా.. ఛైర్మన్ స్పందించలేదు. మంత్రి హెచ్‌కే పాటిల్ సభా వేదికపై మాట్లాడుతూ.. ఛైర్మన్, సభ్యులతో సమావేశం నిర్వహించి డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “నేను నమాజ్ కోసం గదిని అడిగాను ఎందుకంటే అసెంబ్లీలో చర్చలు చాలా ఆలస్యం అవుతాయి. మేము బయటకు వెళ్లి ప్రార్థన చేయలేము. నేను ప్రతిరోజూ నమాజ్ చేస్తాను. దీనిపై స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని మంత్రి తెలిపారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు.” అని ఫరూక్ అన్నారు.
Also Read: Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో నలుగురు మృతి.. ఉత్తరాఖండ్‌లో ప్రమాదం
అసెంబ్లీ ఆవరణలో ప్రజాప్రతినిధులకు మెరుగైన పార్కింగ్, క్యాంటీన్ సౌకర్యాలు కల్పించాలని శాసనసభ్యులు డిమాండ్ చేయడంతో ఈ సమస్య తలెత్తింది. నమాజ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో గదిని కేటాయించడంపై జార్ఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.