ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం అనేది ఇన్వెస్టిగేష్‌న్‌లో ఒక భాగమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తీహార్ జైల్లో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై జేడీ లక్ష్మీనారాయణ ఎన్టీవీతో మాట్లాడారు. కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టే సీబీఐ ఫర్మిషన్ తీసుకుందని తెలిపారు. కవితను విచారించాక తర్వాత ఏం చేయాలన్నదానిపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కవిత నుంచి సరైన ఆన్సర్ వస్తే ఇబ్బంది లేదు గానీ.. రాకుంటే మాత్రం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆలెడ్రీ ఈడీ నుంచి కూడా సీబీఐ కొంత సమాచారం తీసుకునే ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకే కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా సమాచారాన్ని షేర్ చేసుకుంటారని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అప్రూవర్లు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదని.. తగిన ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కాకపోతే అప్రూవర్లకు బెయిల్ దొరుకుతుందని వివరించారు. అప్రూవర్ల సమాచారానికి తగిన ఆధారాలు ఉండాల్సిందేనని.. వాళ్లిచ్చిన సమాచారంతోనే కేసులు కూడా నడవవన్నారు. కచ్చితంగా కొన్ని సాక్ష్యాలనైతే కలెక్ట్ చేయాల్సి ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇక దర్యాప్తు సంస్థలు ఏం కోరుకుంటాయో ఆ విధంగా న్యాయస్థానాలు కూడా సహకరిస్తుంటాయని చెప్పుకొచ్చారు. కోర్టులు ఎప్పుడు విచారణ విషయంలో జోక్యం చేసుకోవన్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. వాస్తనానికి ఇన్వెస్టిగేష్‌న్ సంస్థలకు కోర్టులు సహకరిస్తూ ఉంటాయని స్పష్టం చేశారు. ఇక దర్యాప్తు పూర్తయ్యాకే ఎవరికైనా బెయిల్ వస్తుందన్నారు. అటు తర్వాత దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం రుజువు అయితేనే నిందితులకు శిక్ష పడుతుందని.. లేదంటే విడిచిపెట్టేస్తాయన్నారు. దర్యాప్తు సంస్థల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయన్న సంగతి మాత్రం ఇప్పుడు తెలియదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.