NTV Telugu Site icon

JD Lakshmi Narayana: ప్రత్యేక హోదాయే మార్గం.. ఇప్పుడు అవకాశం వచ్చింది..

Jd Lakshmi Narayana

Jd Lakshmi Narayana

JD Lakshmi Narayana: గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్ల పైగా బడ్జెట్ కావాల్సి ఉంది.. ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వానికి (కూటమి) శుభాకాంక్షలు తెలిపారు.. అయితే, అన్నీ నెరవేలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అన్నారు.. ఆదాయ వనరులు లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ను దేశంలో ఎక్కడ లేని విధంగా విభజన చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఈ 5 ఏళ్లు చాలా కీలకం, ఇప్పుడు కానీ అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం చాలా వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు జేడీ లక్ష్మీనారాయణ.

Read Also: Sanjay Raut: యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా..

ఇక, ఏపీ లో గెలిచిన కొత్త ప్రభుత్వ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్… విభజన హామీల మీద పోరాడే సమయం వచ్చింది.. లోక్ సభ, రాజ్య సభ కలిపి 35 మంది ఎంపీలు ఉన్నారు.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నాం.. విభజన హామీల నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,43 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.. రాష్ట్ర విభజనలో చాలా కోల్పోయాం.. తిరిగి వాటన్నిటిని సమకూర్చాలని కోరారు.. టాక్స్ ల విషయంలో కూడా మినహాయింపు ఇవ్వాలని సూచించారు చలసాని శ్రీనివాస్.