JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ వెర్సటైల్ నటుడు జేడీ చక్రవర్తి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎదురయ్యే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపడానికి ఎందుకు భయపడతారో ఆయన వివరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
Also Read : Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ డైలమా.. సందీప్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇస్తాడా?
Also Read
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
సినిమా ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ.. ‘పరిశ్రమలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. కానీ అవి బయట ప్రపంచానికి తెలియవు. తెలిసిన వారు సైతం నోరు విప్పడానికి సాహసించరు. అందుకే అగ్ర హీరోలు సైతం తమ కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే అంతగా ఇష్టపడర’ అని ఆయన అని కుండబద్దలు కొట్టారు. అలాగే ఇదే అంశంపై సీనియర్ నటి రాధికా గారు కూడా గతంలో స్పందించారు. తన భర్త శరత్ కుమార్ గారు తమ కుమార్తెను సినిమాల్లోకి పంపడానికి అంగీకరించలేదని ఆమె పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు, ఆడపిల్లల పట్ల ఉండే ధోరణి వల్లే తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని జె.డి. చక్రవర్తి మాటల సారాంశం.
ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో తగిన గుర్తింపు లభించడం లేదని, ఇతర భాషల నటీమణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో జె.డి. చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొన్ని అలిఖిత నిబంధనలు, రాజకీయాలు ప్రతిభ ఉన్న వారికి కూడా అడ్డంకిగా మారుతున్నాయని ఈ వీడియో ద్వారా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
తాజావార్తలు
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!