NTV Telugu Site icon

JC Travels: జేసీ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. ఘటనపై పలు అనుమానాలు!

Jc Travels

Jc Travels

మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని జేసీ దివాకర్‌ ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద మొత్తం నాలుగు బస్సులను నిలిపి ఉంచగా.. ఇందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

జేసీ ట్రావెల్స్‌ బస్సు దగ్ధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలిన బస్సు సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఆకతాయిలు చేసిన పనా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. జేసీ ట్రావెల్స్‌ప్తె కేసు తర్వాత బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసున్న వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.