Site icon NTV Telugu

JC Prabhakar Reddy: కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

Jc

Jc

JC Prabhakar Reddy: గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్న టీడీపీ సీనియర్‌ నేత జేసీ ఒక్కసారిగా కన్నీరు కార్చారు.. తనపై అన్యాయంగా కేసులు పెట్టడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. గత వైసీపీ ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగిందన్న ఆయన.. తమ కుటుంబంపై దొంగలుగా ముద్ర వేసి జైలుకు పంపించారు.. ఏప్రిల్ ఒకటి 2017 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని.. రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ర్టాల్లో హైకోర్టు తీర్పునిచ్చాయి.. కానీ, తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేనడిగితే కేసు నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు చేస్తారు.. కానీ, నేను ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తాను అన్నారు..

Read Also: SVSN Varma: బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ

ఇక, తన ట్రావెల్స్‌పై కేసులకు ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ సీతారామాంజనేయులు.. మాజీ మంత్రి పేర్ని నాని.. ఇతర ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులే కారణం అన్నారు.. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలి.. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశాను అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తాను అని హెచ్చరించారు.. మరోవైపు.. ఇక, ఏపీని చెడకొట్టిందే ఐఏఎస్, ఐపీఎస్ లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మా వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని మండిపడ్డారు.. రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులే అని ఆరోపించారు.. నా బస్సులన్నింటిని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. పరువు తీసే బయటి తిరగకుండా చేశారు.. నన్ను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి తిండి కూడా పెట్టలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Exit mobile version