Site icon NTV Telugu

JC Prabhakar Reddy: నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలి..!

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాడిపత్తి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా ఎస్పీని కలిసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు… రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు.. తాడేపల్లి రాజ్యాంగం ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇక, నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు.. ఆ కేసులన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయి? అని ప్రశ్నించారు. మరోవైపు.. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. ఆ రెండు మండలాలు తహశీల్దార్ లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మాకు ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటివి అని.. అందుకే చాలా సీరియస్ గా తీసుకున్నాం.. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్ని కేసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదు.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమాత్రం పోలీసు పరిధిలో పనిచేయడం లేదంటూ ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Read Also: Payal Rajput: ట్రెండీ అందాలతో హీటెక్కిస్తున్న పాయల్ రాజ్‌పుత్

Exit mobile version