JBL Live Beam 3 Launch and Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జేబీఎల్’ ఎప్పటికప్పుడు కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చిన జేబీఎల్.. తాజాగా సరికొత్త తరహాలో బడ్స్‌ను రిలీజ్ చేసింది. ‘జేబీఎల్ లైవ్ బీమ్ 3’ని మంగళవారం (జూన్ 18) భారతదేశంలో విడుదల చేసింది. టచ్ స్క్రీన్ కలిగిన ఛార్జింగ్ కేస్ ఇందులో ప్రత్యేకత. మొత్తంగా 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ మీకు అందిస్తుంది. జేబీఎల్ లైవ్ బీమ్ 3 పూర్తి డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం.
జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్‌బడ్స్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. జేబీఎల్ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమెజాన్, హర్మాన్ ఆడియో) కొనుగోలుకు అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపు ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌లో 1.45 ఇంచెస్ టచ్ స్క్రీన్, స్మార్ట్‌కేస్‌తో దీన్ని జేబీఎల్ తీసుకొచ్చింది. స్క్రీన్ సాయంతో వాల్యూమ్, ఈక్విలైజర్‌ను నియంత్రించొచ్చు. మెసేజ్‌లు చూడడమే కాకుండా.. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు.
Also Read: Airtel New Plan 2024: ఎయిర్‌టెల్‌లో కొత్త ప్లాన్.. తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ!
జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్‌బడ్స్‌లో 10ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఇచ్చారు. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు మెరుగైన పనితీరు కోసం ఆరు మైక్రోఫోన్‌లను ఉపయోగించి.. ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కో ఇయర్‌బడ్ 68 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 12 గంటల ప్లేబ్యాక్ లైఫ్ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ 36 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుంది. మొత్తంగా 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఈ బడ్స్ అందిస్తాయి. స్మార్ట్ కేస్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయొచ్చు.