Site icon NTV Telugu

Jayashankar Bhupalpally: భార్యను చంపి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త..

Murder

Murder

Jayashankar Bhupalpally: భార్యను చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(50) తన భార్య సంధ్య(42)ను తాడుతో ఉరిబెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక ధర్మపత్నిని చంపిన అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు బాలరాజు రామాచారి.. అయితే.. రామాచారికి ఇంతకు ముందు ఓ వివాహం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

READ MORE: Khauf: OTTలో ఈ హర్రర్ సిరీస్‌ను చూశారా? వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

Exit mobile version