NTV Telugu Site icon

Jaya Bachchan: చెప్పింది అర్థం కావట్లేదా.. నా ఫోటోలు తీయొద్దు.. మండిపడ్డ అమితాబ్ భార్య

Jaya Bachchan Sixteen Nine

Jaya Bachchan Sixteen Nine

Jaya Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు కోపం ఎక్కువన్న సంగతిత తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు ఇష్టం లేదని చాలా సార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు. సోషల్ మీడియాలో సైతం జయ ఫోటోగ్రాఫర్లపై కోపం ప్రకటించడం చాలాసార్లు కనిపించింది. అయితే మరోసారి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అలాంటి దుస్సాహసం చేయడంతో జయ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి తన భర్త నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఇండోర్ చేరుకున్నారు. అభిమానులు వారికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అప్పుడే గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీస్తున్నట్లు నటి చూస్తుంది. దానిని గమనించిన జయ బచ్చన్ దయచేసి నా ఫోటోలు తీయకండి.

Read Also: Mukarram Jah: హైదరాబాద్ చేరుకున్న నిజాం ప్రిన్స్ ముకర్రమ్ మృతదేహం

ఆమె అలా రెండు సార్లు చెప్పినా ఆ వ్యక్తి తీస్తూనే ఉన్నాడు. దీంతో జయబచ్చన్ నీకు ఇంగ్లీష్ రాదు కదా.. చెప్తుంటే అర్థం కావట్లేదా నా ఫోటోలు తీయవద్దని అంటూ ఆగ్రహించారు. దీంతో అక్కడున్న మరో వ్యక్తి వీడియో తీస్తున్న అతడిని పక్కను తీసుకెళ్లాడు. అలాంటి వారిని ఉద్యోగం నుంచి తీసేయాలని జయ అక్కడి వారితో చెప్పారు. జయకు సంబంధించిన ఈ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా అభిమానిపై జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేయడం యూజర్లకు నచ్చడం లేదు. పాపరాజీ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోపై కామెంట్ చేస్తూ యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె.. ఓ హిట్లర్ దీదీ అని కామెంట్ చేస్తు్న్నారు. ఆమె ఫోటో తీయోద్దంటే ఎందుకు తీయడం అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Show comments