NTV Telugu Site icon

Player Of The Match Award: ఇకపై దేశవాళీ క్రికెట్‌లోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులకు నగదు బహుమతి: జై షా

Jaishaa

Jaishaa

Prize money For Player Of The Match Award: తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కింద నగదు బహుమతిని అందజేస్తామని తెలిపింది. కింది స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియచేసారు. దేశీయ టోర్నమెంట్‌ లలో కూడా మంచి ప్రదర్శన చేసేలా వారిని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా క్రీడాకారుల మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు.

Surya Kumar Yadav: టెస్టు జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్న: సూర్య కుమార్

జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌, మహిళల టోర్నమెంట్‌ లతో సహా అన్ని దేశీయ క్రికెట్ టోర్నమెంట్‌ లకు రివార్డ్ సిస్టమ్ కవర్ చేస్తుందని., తాము దేశీయ క్రికెట్ ప్రోగ్రామ్ కింద అన్ని మహిళల, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్స్ అందుకోనున్న వారి కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెడుతున్నామని జై షా తెలిపారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే లాంటి సీనియర్ పురుషుల క్రికెట్ లో కూడా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎన్నికైన వారికీ నగదు బహుమతులు అందజేయనున్నట్లు జై షా తెలిపారు.

Chiranjeevi Movies Sequel: అతి త్వరలోనే చిరు బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​: అశ్వినీ దత్​

ఇక ఈ నిర్ణయాన్ని సెప్టెంబరులో దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలవ్వడానికి ముందు ఈ అవార్డు విధానాన్ని ప్రకటించారు. ముందుగా దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ మొదలుకానుంది. ఆ తర్వాత అక్టోబర్‌ లో ఇరానీ కప్ ట్రోఫీ మొదలవుతుంది. ఇక ఆపై అక్టోబర్ 11 నుండి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ జరగనుండగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు వరుసగా నవంబర్, డిసెంబర్‌ నెలలలో జరుగనున్నాయి. మొత్తానికి బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది.