NTV Telugu Site icon

Asia Cup 2023: ‘పాక్‌తో ఆడితే ఓడిపోతామని భారత్‌కు భయం’

India

India

ఆసియా కప్ నేపథ్యంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వార్ నడుస్తోంది. ఈ టోర్నీ పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. తమ క్రికెటర్లు అక్కడికి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబడుతోంది. దీనికి పాక్ కౌంటర్‌ ఇస్తూ.. ఆసియా కప్ కోసం టీమిండియా పాక్‌కు రాకపోతే.. భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ను తాము బహిష్కరిస్తామని చెబుతోంది. బోర్డుల తీరు ఇలా ఉంటే.. మాజీ ప్లేయర్లు కూడా ఈ నిర్ణయంపై కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే భారత్‌కు భయమని ఎద్దేవా చేశాడు.

Also Read: Apps Banned: భారత్‌లో 232 లోన్, బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం..కారణమిదే!

“పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు భారత్ ఎందుకు భయపడుతోంది? ఒకవేళ పాక్ చేతిలో ఓడిపోతే భారత్ ప్రజలు వారిని ఉపేక్షించరు. ఆ విషయం వాళ్లకి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు. ఆసియా కప్ కోసం పాక్ గడ్డపైకి రాకపోతే.. భారత్ జట్టుని ఎక్కడికైనా వెళ్లమనండి. పాకిస్తాన్ క్రికెట్ మనుగడకి భారత్ సాయం అవసరం లేదు. నేను ఈ విషయంలో ఇంతకముందే నా వైఖరి వెల్లడించాను. పాక్‌కు భారత్ రాకుంటే వాళ్లు నరకం పోతారు. మాకేం నష్టం లేదు. వాస్తవానికి ఇది ఐసీసీ పని. ఐసీసీ తన సభ్య దేశాలను నియంత్రించకుంటే ఇక అది ఉండి ఎందుకు..? అందరికీ ఒకే రూల్స్ ఉండాలి కదా. ఇండియా ఒక్కటే క్రికెట్‌ను నడపడం లేదు. అది వాళ్ల దేశంలో పవర్ హౌజ్ (శక్తివంతమైన వ్యవస్థ) కావొచ్చు. ప్రపంచానికి కాదు. పాకిస్తాన్‌కు వచ్చి ఆడండి.. ఎందుకు రారు మీరు..?” అని మియాందాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Jagga Reddy: పుస్తకమే చాలా లావుగా ఉంది.. అందులో మ్యాటర్‌ లేదు..

వాస్తవానికి కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ఈ దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఒకవేళ భారత్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెడితే? అప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లకు కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి. అదే జరిగితే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి గొప్ప ఊరట లభిస్తుంది. కానీ బీసీసీఐ రివర్స్‌లో స్పందిస్తుండటంతో తొలుత రిక్వెస్ట్ చేసిన పాక్ మాజీ క్రికెటర్లు ఆ తర్వాత హెచ్చరికలకు దిగి.. ఇప్పుడు రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తున్నారు.