Site icon NTV Telugu

Jatadhara First Look: సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్ విడుదల..

Jatadhara

Jatadhara

Jatadhara First Look Poster: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ” హరోంహర ” ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సుధీర్ బాబు తన తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా కలిసి ‘జటధార’ అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్రం ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

South Central Railway: మూడు రోజుల పాటు స్పెషల్ రైళ్లు రద్దు..

హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతోంది. తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కనుంది. భారతీయ సినిమా స్థాయిని మరోసారి పెంచేలా జటధార సినిమా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. ఈ సినిమాను ప్రేరణ అరోరా, సివిన్ నారం, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ లు నిర్మిస్తున్నారు. జటధార సినిమాను మహాశివరాత్రి 2025న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేయబోతున్నారు.

Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..

రాబోయే సంవత్సరాల్లో ఈ సినిమా గుర్తుండిపోయే ఈవెంట్ గా ఉంటుందని సినిమా బృందం హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నవ దళపతి సుధీర్ బాబు ఓ పవర్ ఫుల్ రోల్ లో నటించబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ పోస్టర్లో సుధీర్ బాబు శక్తివంతమైన అవతారంలో కనిపించబోతున్నాడు. పోస్టర్ లో షర్టు లేకుండా సుధీర్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకొని శివుడి చిత్రం వద్ద నిలబడి ఉండడం మనం గమనించవచ్చు. ఎప్పటిలాగే సుధీర్ బాబు తన సిక్స్ ప్యాక్ ప్రదర్శించాడు.

Exit mobile version