Site icon NTV Telugu

Jasprit Bumrah: ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వులు పూయించిన బుమ్రా! వీడియో వైరల్

Jasprit Bumrah Press Conference

Jasprit Bumrah Press Conference

ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి.. తన పేరును ఆనర్స్‌ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడుతూ నవ్వులు పోయించాడు. బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్‌ ఫోన్‌ మోగింది. వేంటనే స్పందించిన బుమ్రా.. ‘ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ‘బంతి మార్పు’ అంశంపై జస్ప్రీత్ బుమ్రా స్పందిస్తూ హాస్యభరిత సమాధానం ఇచ్చాడు. ‘బంతిలో మార్పులను నియంత్రించడం చాలా కష్టమే. ఈ అంశంపై మాట్లాడి నేను నా మ్యాచ్ ఫీజును పోగొట్టుకోవాలనుకోవడం లేదు. చాలా కష్టపడి మ్యాచ్ ఆడా, చాలా ఓవర్లు బౌలింగ్‌ వేశా. ఇప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేసి.. మ్యాచ్ ఫీజును కోల్పోదల్చుకోలేదు. బంతి మార్పు అంశంను మనం మార్చలేం, పోరాడలేం కూడా. కొన్నిసార్లు అనుకూలంగా నిర్ణయాలు రావు, మరికొన్నిసార్లు వస్తుంటాయి. జరుగుతుంటే చూడాలి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

Also Read: Bihar Election 2025: నీతీశ్‌ సర్కార్ శుభవార్త.. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్!

లార్డ్స్‌ ఆనర్స్ బోర్డులో తన ఎక్కడం చాలా సంతోషంగా ఉందని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ప్రతిసారీ కెమెరాలు తమ పైనే ఉంటాయని, ప్రాక్టీస్‌ చేస్తున్నా ఓ కన్నేసి ఉంటాయన్నారు. వ్యూస్‌, సబ్‌స్క్రైబర్ల కోడం ప్రతిఒక్కరూ సంచలనం సృష్టించాలని కోరుకుంటారని.. ఆపడం తన చేతుల్లో లేదన్నాడు. భారత జెర్సీ వేసుకున్నా, లేకపోయినా తనని జడ్జ్‌ చేసేవాళ్లు ఉంటారని బుమ్రా పేర్కొన్నాడు. లార్డ్స్‌లో బుమ్రా ఫైవ్‌ వికెట్‌ హాల్‌ (5/74) ప్రదర్శన చేశాడు. హ్యారీ బ్రూక్‌ (11), బెన్‌ స్టోక్స్‌ (44), జో రూట్‌ (104), క్రిస్‌ వోక్స్‌ (0), జోఫ్రా ఆర్చర్‌ (4)లను పెవిలియన్ చేర్చాడు.

Exit mobile version