Jasprit Bumrah likely to be Vice Captain for Team India in Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా.. భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పలు నివేదికల ప్రకారం.. సోమవారం (ఆగస్టు21) సాయంత్రం 17 మంది సభ్యులతో కూడిన జట్టును (India Squad for Asia Cup 2023) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆసియా కప్ 2023కి జట్టును ఎంపిక చేయనుంది.
సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు. ద్రవిడ్ నేరుగా సమావేశంకు హాజరుకానుండగా.. రోహిత్ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేరే అవకాశం ఉంది. అయితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Boat Ride on Crocodiles: ఈడు మగాడ్రా బుజ్జి.. వందలాది మొసళ్లనే ఉ** పోయించాడుగా! వీడియో వైరల్
ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. పాండ్యాపై వేటు జస్ప్రీత్ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుకుంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా దృవీకరించాయి. ‘ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ డిప్యూటీగా బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉంది. అందుకే ఐర్లాండ్ సిరీస్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ బదులుగా బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చాం. సీనియారిటీ పరంగా చూస్తే.. హార్దిక్ కంటే బుమ్రా ముందు వరుసలో ఉన్నాడు. 2022లో బుమ్రా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా వన్డే పర్యటనలో వైస్ కెప్టెన్‌గా పనిచేశాడు’ అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.