Site icon NTV Telugu

IPL 2023: ముంబయి ఇండియన్స్‌కు షాక్‌.. ఐపీఎల్‌ నుంచి పేసర్‌ బుమ్రా ఔట్!

Jasprit Bumrah

Jasprit Bumrah

IPL 2023: గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు కొట్టిపారేశాయి. వైద్యులు నిర్ధారించిన దాని కంటే బుమ్రా గాయం తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఐపీఎల్-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనని క్రీడా వర్గాలు వెల్లడించాయి.

Read Also: Manish Sisodia: నేడు కోర్టుకు మనీష్‌ సిసోడియా.. దేశవ్యాప్త నిరసనలకు ఆప్‌ ప్లాన్

బుమ్రాను ఆసియా కప్ సమయానికి అంతా జట్టులోకి తీసుకురావాలని భావించిన భారత్‌ ఆశలు అడియాశలుగా మిగిలిపోనున్నాయి. బుమ్రా గాయంపై తాజా సమాచారం అతని ఐపీఎల్‌ జట్టైన ముంబై ఇండియన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న​ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్‌నెస్‌ సాధించేందుకు శతవిధాలా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా, రెండిటిలోనూ భారత్ విజయం సాధించింది. మూడో టెస్ట్‌ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. టెస్ట్‌ సిరీస్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడతాయి. తొలుత వన్డే సిరీస్‌ సమయానికి అంతా బుమ్రా ఫిట్‌గా ఉంటాడన్న ప్రచారం కూడా జరిగింది.

Exit mobile version