NTV Telugu Site icon

Jasprit Bumrah: ఏంటి బుమ్రా ఆ ప్రాక్టీస్.. ఓపెనర్‌గా రాబోతున్నావా ఏంటి..? వీడియో వైరల్..

Jasprit Bumrah

Jasprit Bumrah

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లో ఆడి, మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీలో ప్రాక్టీస్ ను ముమ్మరంగా చేస్తోంది.

Also read: Yuvraj Singh: అభిషేక్ శర్మ ప్రపంచకప్లో స్థానం లభించడం ఛాన్సే లేదు.. ఇంకా నేర్చుకోవాలి..!

ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బూమ్రా కేవలం బౌలింగ్ లో మాత్రమే కాకుండా బ్యాటింగ్లో కూడా తన ప్రదర్శనను మెరుగుగా చేయగలడు. ఢిల్లీలో జస్ప్రీత్ బుమ్రా నెట్స్ లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ లో రివర్స్ స్వీప్, ఫుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కనబడుతుంది.

Also read: Spiderman: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..

ఈ వీడియో చూస్తే ఒకవేళ ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో బూమ్రాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ మిస్టరి స్పిన్నర్ సునీల్ నరైన్ తరహాలోనే జస్ప్రీత్ బుమ్రాను కూడా ఒకసారి ఓపెనింగ్ చేయించి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకునేలా టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లతో కొనసాగుతున్నాడు.

Show comments