Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah and Sanjana Ganesan Welcome Baby Boy: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు సోమవారం ఉదయం జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బుమ్రా తన కుమారుడి చేతి ఫొటో పోస్ట్ చేయడమే కాకుండా.. అంగద్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు.
‘మా చిన్ని ‘కుటుంబం ఇప్పుడు పెద్దదైంది. మా మనసులు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు ఉదయమే మా అబ్బాయి అంగద్ జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మా జీవితంలో వచ్చే కొత్త ఆనందాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము’ అని జస్ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. సతీమణి, కుమారుడి చేతిలో తన చేయి పెట్టుకున్న ఫొటోను బూమ్ బూమ్ పోస్ట్ చేశాడు. విషయం తెలిసిన ఫాన్స్.. బుమ్రాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
Also Read: Asia Cup 2023: భారీ సిక్స్ బాదినా ఔటైపోయాడు.. ఆఫ్గాన్ ప్లేయర్ ఖాతాలో చెత్త రికార్డు! వీడియో వైరల్
ఆసియా కప్ 2023లో నేడు నేపాల్‌తో మ్యాచ్ ఆడాల్సిన జస్ప్రీత్ బుమ్రా ఉన్నపళంగా ఆదివారం శ్రీలంక నుంచి ముంబై వచ్చాడు. దీంతో మళ్లీ బుమ్రాకు గాయమైందా? లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం బాలేదా? అని చాలా మంది ఫాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే అతని భార్య సంజనా గణేశన్ డెలివరీ ఉన్నట్లు తెలిసి అందరూ కూల్ అయ్యారు. ఇక నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Our little family has grown & our hearts are fuller than we could ever imagine! This morning we welcomed our little boy, Angad Jasprit Bumrah into the world. We are over the moon and can’t wait for everything this new chapter of our lives brings with it ❤️ – Jasprit and Sanjana pic.twitter.com/j3RFOSpB8Q
— Jasprit Bumrah (@Jaspritbumrah93) September 4, 2023
తాజావార్తలు
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!