NTV Telugu Site icon

PCB: పాకిస్థాన్‌కు వరుస షాక్‌లు.. గుడ్‌బై చెప్పిన జాసన్ గిలెస్పీ!

Pcb

Pcb

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే కోచింగ్‌ బాధ్యతల నుంచి గ్యారీ కిరిస్టెన్ వైదొలగా.. తాజాగా జాసన్ గిలెస్పీ గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గిలెస్పీ పదవీకాలం 2026 వరకు ఉన్నా.. ముందే వైదొలగడం గమనార్హం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌ క్రికెట్ జట్టును కెప్టెన్, కోచ్‌ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. పీసీబీలో సరైన వారు లేకపోవడంతో కెప్టెన్, కోచ్‌లు తరచుగా మారుతున్నారు.

Also Read: Best 5G Smartphones: 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్స్ అదుర్స్ అంతే!

టీమిండియా మాజీ కోచ్ అయిన గ్యారీ కిరిస్టెన్ వైదొలిగిన అనంతరం హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అయితే దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. గిలెస్పీ స్థానంలో పాక్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్‌కు తాత్కాలిక కోచింగ్‌ బాధ్యతలను పీసీబీ అప్పగించింది. అంతేకాకుండా కోచింగ్ బృందం నుంచి టిమ్‌ నీల్సన్‌ను తప్పించింది. దీనిపై గిలెస్పీ అసహనం వ్యక్తం చేశాడని, పీసీబీ తీరు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. జట్టు ఎంపికలో గిలెస్పీ కలుగజేసుకోవడం వలన పీసీబీ గిలెస్పీని తప్పించిందని కూడా సమాచారం. జట్టు ఎంపికకు సంబంధించి పూర్తి అధికారాలను ఆకిబ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.