NTV Telugu Site icon

Japan: దిగజారుతున్న జపాన్ ఆర్థిక వ్యవస్థ.. మూడో స్థానానికి జర్మనీ..

Japan

Japan

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో జపాన్‌ ఉంది. అయితే తాజాగా జపాన్‌ నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదు అయింది. గత ఆర్థి సంవత్సరం జపాన్‌ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్‌ డాలర్లు నమోదైంది.. అదే టైంలో మూడో స్థానంలో ఉన్న జర్మనీ 4.4 ట్రిలియన్‌ డాలర్లను నమోదు చేసింది.

Read Also: Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై జై షా కీలక ప్రకటన!

ఇక, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జపాన్‌ వాస్తవిక జీడీపీ వృద్ధిని చూస్తే ఏడాదికి 0.4 శాతం తగ్గుదల కనిపిస్తుంది.. మూడు నెలల వారీగా చూస్తే 0.1 శాతం మేర క్షీణించింది. తాజా ధరలతో నామమాత్రపు జీడీపీని లెక్కిస్తుండగా.. స్థిర ధరల ఆధారంగా వాస్తవిక జీడీపీని లెక్కించనున్నారు. జపాన్‌లో ఎందుకింత క్షీణత కనిపిస్తుంది అనే దాన్ని విశ్లేషిస్తే.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవటంతో పాటు పిల్లల సంఖ్య బాగా తగ్గిపోవటం వల్ల ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తుంది.

Read Also: Zomato Stock Price: బుల్లిష్ గా మారిన జొమాటో స్టాక్.. ఇన్వెస్టర్లకు 47శాతం లాభాలు తెచ్చే ఛాన్స్

అయితే, పోటీతత్వాన్ని జపాన్‌ దేశం క్రమేపీ కోల్పోతుంది. తాజాగా వెలువడిన గణాంకాలు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నాయి. అణు దాడుల్లో సర్వనాశనమైన దశ నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన జపాన్‌.. సుమారు రెండు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక, 2010లో చైనా విజృంభించి జపాన్‌ను మూడో స్థానానికి నెట్టివేసింది.