Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఒక పెను మార్పు చోటుచేసుకుంది. శాంతి మంత్రాన్ని జపిస్తూ దశాబ్దాలుగా ఆయుధ విక్రయాలకు దూరంగా ఉన్న జపాన్, ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, యుద్ధ విమానాలతో సహా భారీ ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించేందుకు జపాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
50 ఏళ్ల నిషేధానికి తెర
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన రాజ్యాంగం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠినమైన నిషేధాన్ని విధించుకుంది. అయితే మారుతున్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల దృష్ట్యా తాజాగా జపాన్ ప్రధాని సనాయే తకైచి మంత్రివర్గం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో జపాన్ ఏమి విక్రయిస్తుందో అధికారికంగా జాబితాను ప్రకటించనప్పటికీ, ఫైటర్ జెట్లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధనౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు జపనీస్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా కోసం ప్రత్యేక యుద్ధనౌకలను నిర్మించడానికి జపాన్ అంగీకరించడం గమనార్హం.
షరతులు వర్తిస్తాయి
ఆయుధాల విక్రయంలో జపాన్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. కేవలం ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్‌కు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాని తకైచి స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన రక్షణను తాను ఒంటరిగా చూసుకోలేదు. అందుకే సహకారం అవసరం” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత సాధించాయి. భవిష్యత్తులో ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటే ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. 1967లో ప్రవేశపెట్టి, 1976లో పటిష్టం చేసిన పాత నిబంధనల ప్రకారం.. జపాన్ కేవలం నిఘా పరికరాలు, మైన్-స్వీపింగ్ వంటి ప్రాణాంతకం కాని సామాగ్రిని మాత్రమే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్ల విక్రయానికి సిద్ధమవ్వడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీనివ్వబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!