NTV Telugu Site icon

Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!

Jani Master Wife

Jani Master Wife

Jani Master Wife: తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్‌ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. జానీ మాస్టర్‌ నిజం ఒప్పుకున్నారని మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపడేశారు. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

Read Also: Harsha Sai Audio Leak: హర్ష కృష్ణుడి లాంటి కళ్లు నీవి.. యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్

ఇంటర్వ్యూలలో జానీ మాస్టర్‌ గురువుగా దొరకడం అదృష్టమని చెప్తున్న ఆ అమ్మాయి.. మళ్లీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్తోందని.. ఏది నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వీడియోల్లో చూస్తే.. ఆమె తప్పుడు ఆరోపణలు చేసిందని క్లియర్‌గా అర్థమవుతోందన్నారు. తనకు మాస్టర్‌ లైఫ్ ఇచ్చాడని కూడా చెప్పిన ఆ అమ్మాయి.. ఇప్పుడు వేధిస్తున్నారని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి ఇలా చేసి ఉండొచ్చని జానీ మాస్టర్ భార్య అయేషా అనుమానం వ్యక్తం చేశారు. ఓ పెద్ద హీరో వెనక ఉండి నడిపిస్తున్నాడనేది అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. కావాలనే జానీమాస్టర్‌పై కుట్రపూరితంగా వ్యవహరించారని అయేషా తెలిపారు. ఈ విషయంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు.

 

Show comments