NTV Telugu Site icon

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్

Jani Master Eyes

Jani Master Eyes

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలతను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరైన సుమలత.. మహిళా కోరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలు ఖండించింది. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించింది. తన భర్త జానీపై లేని పోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు. మరో వైపు రేపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించనుంది.

READ MORE: Pemmasani Chandrasekhar: గుంటూరు నగరాన్ని క్లీన్సిటీగా చేసేందుకు కృషి చేయాలి..

తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్‌ భార్య అయేషా అలియాస్ సుమలత ఇటీవల అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. జానీ మాస్టర్‌ నిజం ఒప్పుకున్నారని మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపడేశారు. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలలో జానీ మాస్టర్‌ గురువుగా దొరకడం అదృష్టమని చెప్తున్న ఆ అమ్మాయి.. మళ్లీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్తోందని.. ఏది నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వీడియోల్లో చూస్తే.. ఆమె తప్పుడు ఆరోపణలు చేసిందని క్లియర్‌గా అర్థమవుతోందన్నారు.

Show comments