NTV Telugu Site icon

Janhvi kapoor: నటితో కలిసి చెన్నైలో గుడికెళ్లిన జాన్వీ కపూర్.. శ్రీదేవి ఫేవరెట్ ప్లేస్ అంటూ!

Janhvi Kapoor Visited Temple

Janhvi Kapoor Visited Temple

Janhvi kapoor Visited Sridevi’s Favourite Temple: నటిగా భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే అతి తక్కువ మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఆమె అనూహ్య మరణం పలువురిని కలచివేసింది. నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతుండగా, నిన్న చెన్నైలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు చిత్ర కథానాయకుడు రాజ్‌కుమార్‌రావు, జాన్వీ కపూర్‌లు హాజరయ్యారు. వీరిద్దరూ షారుక్ ఖాన్ కోల్‌కతా జట్టుకు మద్దతుగా నిలిచారు. ఆట ముగిసే సమయానికి కోల్‌కతా IPL 2024 ట్రోఫీని గెలుచుకుంది. దాని వేడుకలు పూర్తయ్యాయి.

Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ధరతో హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనచ్చు తెలుసా?

ఇక ఇదిలా ఉండగా నటి జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చెన్నైలోని ప్రసిద్ధ ముప్పట్టమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోను షేర్ చేసింది. జాన్వీ కపూర్‌తో పాటు ఆ ఆలయానికి ప్రముఖ నటి మహేశ్వరి కూడా వెళ్లింది. నటి మహేశ్వరి నటి జాన్వీ కపూర్‌కు సోదరి వరుస అవడం గమనార్హం. దేవర: పార్ట్‌ 1తో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దేవర చిత్రం యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో పాట విడుదల కానుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. శ్రీకాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత ఆమె బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది.

Show comments