Janhvi Kapoor: శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. శ్రీదేవిలానే గ్లామర్ క్వీన్ గా కనిపిస్తుంది జాన్వీ. ఎప్పటికప్పుడు తన ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా, ట్రెడిషనల్ లుక్ లో అయినా జాన్వీ అదరహో అనిపిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా జాన్వీ నటించిన బావల్ చిత్రానికి థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఎవరిని ప్రేమించవద్దని తల్లిదండ్రులు ఆమెకు తరచూ చెప్పేవారని తెలిపిన జాన్వీ.. తన మొదటి బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేక్ కావడానికి కారణాన్ని తెలిపింది. స్వైప్ రైడ్ అనే టాక్ షో లో పాల్గొన్న జాన్వీ ఈ విషయాలను తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన ఎపిసోడ్ విడుదల అయ్యింది.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మకు సర్జరీ.. ఎంతో కాలం నుంచి ఆ నొప్పితో బాధపడుతున్న పూజా
అందులో జాన్వీ మాట్లాడుతూ తన మొదటిసారి సీరియస్ గా లవ్ చేశానని తెలిపింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులతో చాలా అబద్దాలు చెప్పాల్సి వచ్చేదని చెప్పింది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్, తనకు మధ్య కూడా చాలా అబద్దాలు ఉండేవని, ఒక బంధంలో నమ్మకం చాలా ముఖ్యమంది. ఇక తాను లవ్ చేయడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, ఎవరిని లవ్ చేయవద్దని వారు తరచూ చెబుతూ ఉండేవారిని జాన్వీ తెలిపింది. ఇక తల్లిదండ్రులతో అబద్దాలు చెప్పలేక బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చిందని ఈ ముద్దు గుమ్మ తెలిపింది. తల్లిదండ్రులతో నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్న తాను వారితో నమ్మకంతో ఉంటేనే అన్ని పనులు ఈజీగా ఉంటాయని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఆయన జంటగా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన జాన్వీ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక ఇందులో జాన్వీ కపూర్ డీగ్లామరస్ గా కనిపించనుందని టాక్.