NTV Telugu Site icon

Janhvi Kapoor Ramp Walk: లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో జాన్వీ తళుకులు.. ర్యాంప్‌ వాక్‌ వీడియో తప్పక చూడాల్సిందే!

Janhvi Kapoor Ramp Walk

Janhvi Kapoor Ramp Walk

ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’ 2025లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తళుక్కున మెరిశారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ రాహుల్ మిశ్రా డిజైన్‌ చేసిన దుస్తులను ధరించి స్టేజ్‌పైన ర్యాంప్‌ వాక్‌ చేశారు. బంధాని ఫాబ్రిక్‌తో రూపొందించబడిన నల్లటి గౌనులో జాన్వీ హొయలు పోయారు. జాన్వీ అందాలు, ర్యాంప్‌ వాక్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫ్యాష‌న్ డిజైన‌ర్ రాహుల్ మిశ్రాకు జాన్వీ కపూర్ షో స్టాపర్‌గా నిలిచారు. పొడవాటి నల్లటి కోటు కింద బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో జాన్వీ స్టేజీపై అడుగుపెట్టారు. స్టేజీపై మధ్యలోనే జాన్వీ కోటు తీసేసి.. ఫొటోలకు పోజులిచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో స్టిల్స్ ఇచ్చారు. దీంతో ఫొటో గ్రాఫర్స్ అందరూ జాన్వీ వెనుక ఫాలో అవుతూ.. ఆమె అందాలను కెమెరాలో బంధించారు. ఆపై కొంతదూరం తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించారు. చివరకు మరోసారి పోజులిచ్చి వెళ్లిపోయారు. జాన్వీ ర్యాంప్‌ వాక్‌కు సంబంధించిన వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Also Read: Chiru-Anil: చిరు-అనిల్‌ మూవీ షురూ.. క్లాప్‌ కొట్టిన వెంకీ!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం జాన్వీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ పెద్ద విజయాలు మాత్రం అందుకోలేదు. అయినప్పటికీ జూనియర్ శ్రీదేవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి జాన్వీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి మూవీతోనే మంచి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు.