NTV Telugu Site icon

Janhvi Kapoor: మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?

Jahnvi Kapoor

Jahnvi Kapoor

స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి..

తమిళ స్టార్ హీరో సూర్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కంగువా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా సూర్య కు బిగ్గెస్ట్ హిట్ ను ఇస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి దిశాపటాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనితో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రంలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ దర్శకుడు మహాభారత ఇతిహాసాన్ని రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పాన్‌ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఈ సినిమాలో సూర్యకు జంటగా జాన్వీ కపూర్ ను సంప్రదించిన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..