NTV Telugu Site icon

High Tension: గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం.. జనసేన- వైసీపీ మధ్య ఘర్షణ..

Tdp Janasena

Tdp Janasena

High Tension In Gannavaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే, ఎన్నికల కమిషన్ హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు చేశారు. అయినా, ఇంకా టీడీపీ- వైసీపీ నేతల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. కాగా, ఎన్నికల సంఘం ఇప్పటికే కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. టీడీపీ- జనసేన- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు సమన్వయం పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Brij Bhushan Sharan Singh : బుల్డోజర్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటా… బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తిరుగుబాటు వైఖరి

అయితే, కృష్ణా జిల్లా గన్నవరంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. బాపులపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన- వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు చేరుకున్నారు. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని చలమలశెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోప వాదనలు జరగడంతో పోలీసులు సర్ది చెప్పి.. అక్కడి నుంచి పంపించారు.

Show comments