Site icon NTV Telugu

Nadendla Manohar: ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు..

Nadendla Manohar

Nadendla Manohar

Janasena-TDP-BJP alliance: ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమైంది.. మెజార్టీల గురించే చర్చించుకుంటున్నారు అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రధాని సభకు పేర్లు లేకుండా పాసులు బ్లాంకుగా ఇచ్చారు.. ప్రధాని హాజరయ్యే సభకు ఈ తరహా పాసులు జారీ చేయడం ఎప్పుడూ చూడలేదు.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరపాలి.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంలో పోలీసుల పాత్రపై ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా పవన్ చేసిన కృషి నిన్నటి ప్రజాగళం వేదిక మీద కన్పించింది.. ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు.. మూడు పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు.. దుష్ప్రచారాలకు ఎవ్వరూ లొంగొద్దు.. తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.. పొత్తుల విషయంలో కొందరికి నిరాశ ఎదురైంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు.

Read Also: Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ కు రీ రికార్డింగ్ చేయనున్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

మా పార్టీ సీనియర్ నేతలను మేం కాపాడుకుంటామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మేమేం ఏం చేస్తామో.. తొందరెందుకు.. ఇంకా సమయం ఉంది.. దూషణలకు మేం దూరంగా ఉంటాం.. దీని వల్ల ఏం ఉపయోగం?.. ప్రజాగళం సభ సక్సెస్ అయింది.. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ గురించి, మౌళిక సదుపాయాల కల్పన కోసం తాము చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు అని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన రూ. 91 వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఇప్పటికీ లెక్క తేలని పరిస్థితి ఉంది.. ఏపీకి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం.. సంక్షేమంతో పాటు.. అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ అవసరం ఉంది.. ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్ రాబోతోంది అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Exit mobile version