Site icon NTV Telugu

Janasena: సైన్యానికి దైవ బలం కోసం జనసేన పూజలు.. షష్ఠ షణ్ముఖ క్షేత్రాలకు ఎమ్మెల్యేలు!

Janasena

Janasena

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పిన మన దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజల కోసం జనసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇవాళ దేశ సైన్యం, దేశ నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్నాయి.

తమిళనాడులోని ఆరు మురుగన్ ఆలయాలతో పాటు కర్ణాటకలో రెండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాలు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక ఆలయాల్లో మంగళవారం జనసేన నేతలు పూజలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరుపరకుండ్రంలోని ఆలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ పూజలు చేయనున్నారు. పళని క్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, స్వామిమలై క్షేత్రంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూజలు చేయనున్నారు.

Also Read: Train Accident: సెల్‌ఫోన్‌.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది!

పూజలు చేయనున్న నేతలు వీరే:
తిరుచెందూర్ ఆలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

తిరుత్తణిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

పాలముదిరిచోళై మురుగన్ ఆలయంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

కర్ణాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజాదికాల కోసం అనంతపురం నుంచీ అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ టి.సి.వరుణ్

రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ బృందం ఘాటీ శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్య ఆలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య ఆలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

పిఠాపురం శ్రీ పురూహూతిక ఆలయంలో పూజల్లో పాల్గొననున్న డీసీసీబీ ఛైర్మన్ గా తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్

ఇప్పటికే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలోని పార్టీ నేతలు, శ్రేణులతో కూడిన బృందం సూర్య నమస్కారాలు, శాంతి హోమం

గుంటూరులో నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొననున్న రాష్ట్ర మాల కార్పొరేషన్ ఛైర్మన్ డా.పెదపూడి విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ డా.పాకనాటి గౌతమ్ రాజ్

ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఛైర్మన్ గా నియమితులైన షేక్ రియాజ్, హజ్ కమిటీ సభ్యుడు అబిద్ ఇస్లాం ధర్మాన్ని పాటించి మంగళగిరిలో ప్రార్థనలు

Exit mobile version