Site icon NTV Telugu

Pantham Nanaji: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ

Pantham Nanaji

Pantham Nanaji

Pantham Nanaji: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కంటతడి పెట్టుకున్నారు. డాక్టర్‌ను తిట్టినందుకు రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. నిన్న ఆవేశంతో తప్పుగా మాట్లాడానని ఆయన క్షమాపణలు చెప్పారు. తాను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.

Read Also: Tragedy: విహారయాత్రలో విషాదం.. వాటర్‌ఫాల్స్‌లో ఐదుగురు మెడికల్‌ విద్యార్థులు గల్లంతు

“ఒక ప్రజా ప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న నేను అలా ఉన్నాను. ఇలాంటి విషయాలలో నన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోకూడదు. ఎవరో తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. నేను తప్పు చేశాను కాబట్టి రేపు నేను ప్రాయశ్చిత దీక్ష చేస్తాను. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మా ఇంటి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటాను” అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.

Exit mobile version