Site icon NTV Telugu

Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

Arava

Arava

Arava Sridhar: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. విచారణ కమిటీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అరవ శ్రీధర్ అంశంపై జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మొన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు విచారణ కమిటీ నివేదిక సిద్ధం కాకపోవడం హాట్ టాఫిక్ గా మారింది. గత నెల 27వ తేదీన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు లేవు? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు వారాలు గడిచినా నివేదిక రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ

అయితే, అరవ శ్రీధర్‌ను కాపాడే ప్రయత్నమేనా? జరుగుతుందని విపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారంపై నివేదిక మరింత ఆలస్యం అయింది. ఈ వారంలో మరోసారి రైల్వే కోడూరులో విచారణ కమిటీ పర్యటించనుంది. పోలీసులు, అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరణకు కమిటీ కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అవసరమైతే మూడోసారి కూడా ఆ ప్రాంతంలో పర్యటనకు సిద్ధమని కమిటీ తెలియజేస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎపిసోడ్‌పై రోజుకో వీడియోను బాధితురాలు వీణా విడుదల చేస్తుంది. తాను పవన్ కళ్యాణ్‌ శాఖకు చెందిన ఉద్యోగినని చెబుతున్న ఆమె.. తనకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతుంది. ఇంత జరుగుతున్నా విచారణ కమిటీ నివేదిక కోసం పార్టీ అధిష్టానం ఎదురు చూడడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version