NTV Telugu Site icon

Ippatam Tension: ఇప్పటంలో ఆందోళన విరమించిన జనసేన

Ippa2

Ippa2

ఇప్పటంలో టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆందోళన విరమించారు జనసేన నేతలు. జనసేన పీఏసీ మెంబర్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మచిలీపట్నం జనసేన సభ జరుగుతుండడంతోనే ఇప్పటంలో కూల్చి వేతలు చేపట్టారు. 1916లో అధికారులు సర్వే మ్యాప్ చూపిస్తున్నారు. ఎందుకు మ్యాప్ చేశారో అధికారులు చెప్పడం లేదు. అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు చేయడం దుర్మార్గం. భవిష్యత్తులో ఇప్పటంలో ప్రజల ఆమోదంతోనే చేపడతామని హామీ ఇచ్చారు కాబట్టి విరమిస్తున్నాం అన్నారు. ఇప్పటంలో జేసీబీలతో వస్తే హైవేలను దిగ్భంధించాం.

Read Also: Tension in Ippatam: ఇప్పటంలో టెన్షన్.. జనసేన నేతల ఆందోళన

జేఏసీ నేత గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది. జగన్ ని ఎన్నుకున్నందుకు రాష్ట్రం తగలబడిపోతుంది. అధికారులు విజ్నత కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు.మచిలీపట్నం సభను ఆపాలని అక్కడి వారిని బయపెట్టాలని చూస్తున్నారు.మేము జగన్ దారిలోకే వెళ్తాం.. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాం.జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు తీసేసి ప్రొక్లెయిన్ గుర్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ కి రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెబుతాం అన్నారు జనసేన నేతలు.

Read Also: Kapil Sibal: బీజేపీపై పోరాటానికి సిబల్ కొత్త వేదిక.. సీఎంలు కలిసి రావాలంటూ పిలుపు